Tuesday, 3 November 2026

డెస్మండ్‌ టూటుకు అనారోగ్యం

జోహన్నెస్‌బర్గ్‌,ఏప్రిల్‌ 24 :దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన ప్రముఖుడు,నోబెల్‌ గ్రహీత డెస్మండ్‌ టూటూ (81) అనారోగ్యంతో కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు.ఆయనకు అత్యుత్తమ వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోందని డెస్మండ్‌,లీ టూటూ లెగసీ ఫౌండేషన్‌ ప్రకటించింది.ఐదు రోజులపాటు ఆయన చికిత్స పొందే అవకాశం ఉన్నట్టు తెలిపింది.కాగా,డెస్మండ్‌ 1986 నుంచి 1996 వరకు కేప్‌టౌన్‌ ఆర్చి బిషప్‌గా ఉన్నారు.ఆ సమయంలో దేశంలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా బలమైన గొంతు వినిపించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *