Wednesday, 4 November 2026

డైట్ కళాశాల భూమిని వేరే అవసరాలకు కేటాయిస్తే సహించం.

 

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 10డైట్ కళాశాల భూమిని ఇతర అవసరాలకు కేటాయిస్తే సహించేది లేదని ఎబివిపి నాయకులు హెచ్చరించారు.సోమవారం ఎబివిపి విద్యార్థి నాయకులు కళాశాలను సందర్శించి అక్కడ నెలకొన్నసమస్యలను పరిశీలించారు. కాలేజీలో పేరుకుపోయిన చెత్త ను తొలగించి శుభ్రం చేయించాలని కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈసందర్భంగా మేడ్చల్ జిల్లా ఎబివిపి కన్వీనర్ అఖిల్ మాట్లాడుతూ.మల్కాజిగిరి లో ఉన్నటువంటి డైట్ కాలేజీని వేరే అవసరాల కోసం కేటాయిస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.విద్యార్థులతో కలిసి అక్కడ ఉన్న సమస్యలపై మరియు వారి కళాశాల భూ సమస్యపై వారికి అవగాహన కల్పిస్తూ డైట్ కళాశాలకు సంబంధించిన పది ఎకరాల భూమి ఉంటేనే ఎన్సిటిఇ అనుమతి ఇస్తుందని.డైట్ కళాశాల అనుమతి రద్దు చేసి మూసివేసే కుట్రలో భాగంగానే వేరే అవసరాల కోసం భూమిని కేటాయించారని ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి పునః పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.కోర్టు మల్కాజిగిరి లోనే ఉండాలి,కానీ విద్యావ్యవస్థని కొల్లగొట్టి కట్టె కన్నా,ఇతర చోట స్థలం సేకరించి కట్టించాలని మాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విపుల్, అవినాష్, శశాంక్ మరియు ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.