అచ్చంపేట ఆర్సీ,10 ఏప్రిల్2023, జనం సాక్షి న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపన సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ, పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఇలా ఘటనలపై ప్రభుత్వ తీరూపాయి నిరసన తెలుపుతూ యూత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం వల్ల ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి పోలీసులు చాకచక్యంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ శ్రేణుల కార్యకర్తలను అదుపులోకి తీసుకొని డీసీఎం లో పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చత్రు నాయక్, మహబూబ్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల నిరుద్యోగ యువత భవిష్యత్తులతో చెలగాటమాడుతున్నారని టీఎస్పీఎస్సీ పదవ తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ ఉదంతాలే ఇందుకు నిదర్శనం అని అన్నారు. ప్రభుత్వం వెంటనే టీఎస్పీఎస్సీ టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీ పై సిబిఐ విచారణ చేపట్టి దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను అరెస్టు చేసి శిక్షించాలన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మోటమారి రాజు, తగుళ్ల అంజి యాదవ్, బద్ధులు అజయ్ యాదవ్ ,వడ్నాల హరీష్,తదితరులు పాల్గొన్నారు




