డోన్‌లో వైద్యుడి దారుణ హత్య

దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కర్నూలు,మే11(జ‌నం సాక్షి ):  డోన్‌ పట్టణంలో ప్రముఖ వైద్యుడు పోచ శ్రీకాంత్‌రెడ్డి (47) హత్యకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది.  తన ఇంట్లో ఉన్న శ్రీకాంత్‌రెడ్డి వద్దకు గురువారం ముగ్గురు దుండగులు వచ్చారు. ఓ వ్యక్తికి వైద్యం చేయాలని కోరుతూ ఆయన్ను వారు ఆటోలో తీసుకెళ్లారు. అయితే రాత్రి వరకు కూడా శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి రాలేదు. దీంతో ఆయన ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. కానీ ఆయన ఆచూకీ మాత్రం లభించలేదు. డోన్‌లోని ఇండోర్‌ స్టేడియం సవిూపంలో శ్రీకాంత్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. ఆయన్ను ఆటోలో తీసుకెళ్లిన దుండగులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీకాంత్‌రెడ్డి తండ్రి ప్రభాకర్‌రెడ్డి కూడా వైద్యుడే.
ప్రస్తుతం ఆయన టిడిపి నేతగా ఉన్నారు. శ్రీకాంత్‌రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్యతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. డిఎస్పీ బాబా ఫక్రుద్దీన్‌ ఘనటా స్ళికి చేరుకుని విచారణ చేపట్టారు.
————–

తాజావార్తలు