Wednesday, 4 November 2026

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి మూడు నెలల జైలుశిక్ష

బర్కత్‌పుర: మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఓ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, 2వేలు జరిమానాను కోర్టు విధించింది. సైదాబాద్‌లో నివాసముంటున్న బలరామ్‌రాజు ప్రైవేట్‌ ఉద్యోగి. 2013 నుంచి మీర్‌చౌక్‌, సుల్తాన్‌బజార్‌, బహదూర్‌పురా, మలక్‌పేట, ఆబిడ్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడి జరిమానా చెల్లించడమేగాక జైలుకు కూడా వెళ్లాడు. ఈనెల 6వ తేదీన కాచిగూడ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుండగా బలరామ్‌రాజు తాగి పట్టుబడ్డాడు. ఎర్రమంజిల్‌లోగల మూడో మెట్రోపాలిటన్‌ కోర్టులో గురువారం హాజరపర్చగా న్యాయమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించారని కాచిగూడ ట్రాఫిక్‌ సీఐ జ్ఞానానందరెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *