హైదరాబాద్ : సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వరకు మద్యం తాగి వాహనాలు నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు 565 మంది పై కేసు నమోదు చేశారు. వీరిపై చార్జిషీటు దాఖలు చేసి సంబంధిత కోర్టుల్లో హాజరుపర్చగా 17 మందికి జైలు శిక్ష పడింది. మొ త్తం ఆరు లక్షల 26 వేల 400 జరిమానా విధించారు. ఇదేకాలంలో ఔటర్‌పై నిబంధనలు ఉల్లంఘనులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 411 కేసులు నమోదు చేశారు. తప్పడు ప్రదేశంలో పార్క్ చేసినందుకు 97, తప్పుడు మార్గంలో డ్రైవ్ చేయడం, త ప్పుడు మార్గం నుంచి ప్రవేశించడం, ప్రమాదరం నడపడం, లేన్ల ను అతిక్రమించడం వంటి ఉల్లంఘనలకు 314 కేసులు నమోదు చేశారు. మొత్తం 3 లక్షల 57 వేల 900 జరిమానా విధించారు.




