హైదరాబాద్,ఫిబ్రవరి25 (జనంసాక్షి) : హైదరాబాద్ నగరంలో గత రెండు రోజుల క్రితం పట్టుబడిన డ్రగ్స్ కేసు నిందితులను పోలీసులు బుధవారం విూడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను డీసీపీ వెంకటేశ్వర్లు విూడియాకు వివరించారు. నిందితుల్లో ఒకరు సినీ దర్శకుడు శశాంక్‌రెడ్డి కాగా మరొక వ్యక్తి ఈవెంట్ మేనేజర్ అన్నారు. వీరితో పాటు నలుగురు నైజీరియన్లు ఉన్నారు. మరో ఇద్దరు నైజీరియన్లు పరారీలో ఉన్నారని అన్నారు. నిందితుల నుంచి 90 గ్రాముల కొకైన్, ఆరు సెల్‌ఫోన్లులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విద్యార్థుల ముసుగులో నైజీరియన్లు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. అక్రమ రవాణా, వ్యాపారం నిమిత్తం వీరు తరుచుగా ముంబయి, గోవా వెళ్లేవారు. నిందితుల్లో కొందరిపై గతంలోనూ కేసులు ఉన్నాయి. శశాంక్‌రెడ్డి, రవికుమార్‌లకు మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డారు. డ్రగ్స్ వ్యాపారంతో సంబంధం లేదని డీసీపీ పేర్కొన్నారు. అయితే ఎవరైనా దీనికి అలవాటు పడవచ్చన్నారు. అలవాటు ఉన్నవారిని పట్టుకుని నైజీరియన్లు మత్తు అమ్ముతున్నారని అన్నారు.




