డల్లాస్ వెంచర్ క్యాపిటల్‌తో టీ హబ్ ఒప్పందం.. మంత్రి కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్ : డల్లాస్ వెంచర్ క్యాపిటల్‌లో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా ఫండ్ పేరుతో టీ హబ్‌కి డల్లాస్ వెంచర్ క్యాపిటల్ డబ్బులు ఇవ్వనుంది. టీ హబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డల్లాస్ వెంచర్ సంస్థకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. డల్లాస్ వెంచర్ సంస్థ భారత్‌లో అనేక స్టార్టప్స్ నెలకొల్పిందని చెప్పారు. భారత్‌లో ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన గొప్పదని కేటీఆర్ కొనియాడారు. హైదరాబాద్‌లో సుమారు 6 వేల స్టారప్‌లు ఉన్నాయి. భారత్ ఆర్థికంగా వృద్ధి చెందుతుందన్నారు. భారత్‌కు పెట్టుబడులు రాబట్టడం కష్టం కాదన్నారు. మంచి ఆలోచన ఉన్న స్టార్టప్‌లకు నిధులు ఇబ్బంది కాదన్నారు. భారత్‌లో మొదటి ప్రైవేటు రాకెట్ టీ హబ్ నుంచే వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.




