చదువులో ఫస్ట్.. అన్నింటిలో బెస్ట్
పద్మశాలి నగదు ప్రతిభా పురస్కారం అందుకున్న శశాంక్.
పద్మశాలి ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులలో జిల్లా కేంద్రం చెందిన బాలల ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థి లషెట్టి శశాంక్ పద్మ శాలి ప్రతిభా పురస్కారం జిల్లా కలెక్టర్ భారతి హోల్లి కేరి మరియు సంఘం జిల్లా నాయకులు పొన్నమల్లయ్య, అల్లి రాజేశ్వర్, అన్నం శ్రీనివాస్,ఈగ కనకయ్య, సత్యనారాయణ చేతుల మీదుగా అందుకొని పాఠశాలకు వన్నె తేవడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
తండ్రి శ్రీనివాస్ దినసరి కూలీ గా ఉన్న సాధారణ కుటుంబ నేపథ్యం కలిగి ఉన్న శశాంక్ చదువుతో పాటు పలు సహా పాట్య కార్యక్రమాల్లో పర్యావరణం ,వ్యాసరచన,ఆటల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ పాఠశాలలో ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన శశాంక్ “చదువులో ఫస్ట్ అన్నింటిలో బెస్ట్” గా రాణించటం పట్ల పాఠశాల హెచ్.ఎం. దుర్గయ్య ఉపాధ్యాయులు వేణుగోపాల్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు గుండేటి యోగేశ్వర్ ,వెంకటేశ్వర్లు, చిమ్మని శ్రీనివాస్, రాజయ్య, మహేష్, వర్మ, సునీతా దేవి, భాగ్య లక్ష్మి, రంగరాణి, నీల్ కమల్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. పట్టుదలతో చదివి తల్లి దండ్రులకు,పాట శాలకు మంచి పేరు తెచ్చేలా ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేస్తానని శశాంక్ తెలిపారు.




