హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో విచారణ నిమిత్తం తీహార్ జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన మక్బూల్, ఇమ్రాన్‌లను ఈ ఉదయం ఢిల్లీకి తరలించారు. అంతకుముందు వీరిని భారీ భద్రత మధ్య శంషాబాద్ విమానశ్రయానికి తీసుకువచ్చారు. ఎన్‌ఐఏ కార్యాలయంలో ఇద్దరిని 4 రోజులపాటు అధికారులు విచారించారు. ఐదు రోజుల కస్టడీ నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో వీరిద్దరిని ఢిల్లీకి తరలించి కోర్టులో హాజరుపరుచనున్నారు.




