హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణ ప్రాంగణాల్లో భద్రతను మరింత పటిష్ఠ పరచాలని ఆర్టీసీ నిర్ణయించింది. మూడు రోజుల క్రితం నగరంలోని ఎంజీబీఎన్ పరిసరాల్లో పేలుడుకు వినియోగించే వస్తువులు లభ్యమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎంజీబీఎన్‌తోపాటు నిత్యం రద్దీగా ఉండే జూబ్లీ బస్టాండ్, విజయవాడ, విశాఖ కరీంనగర్, తిరుపతి, గుంటూరు, వరంగల్ జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్ల్‌లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పరికరాల ఏర్పాటు కోసం అంచనాలను రూపొందించారు.




