ఢిల్లీలో మరో గ్యాంగ్‌రేప్
న్యూఢిల్లీ: సామూహిత అత్యాచార ఘటనతో నిన్నమొన్నటి వరకు అట్టుడికిపోయిన దేశారాజధాని ఢిల్లీలో మరో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధానిలో మహిళలపై వరుస అత్యాచారాలు జరుగుతుండటంతో ఢిల్లీ ప్రజలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులోకి ఆమెను తీసుకుపోయి ఆమెపై బలాత్కారం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ ఫైజాబాద్‌లో కేసు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.