Updated : 2/5/2015 1:12:12 PM
Views : 147
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 7న జరగనున్నాయి. ఢిల్లీ ఎన్నికలకు 55,000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 7న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 10న ఓట్ల లెక్కింపు. ఈ రోజు సాయంత్రం వరకు మాత్రమే ప్రచారానికి గడువు.





