గద్వాల నడిగడ్డ, జూన్ 10 (జనం సాక్షి);తాండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి తెలంగాణలో గ్రామ గ్రామాన సుపరిపాలన అందజేస్తున్నట్లు జడ్పీ చైర్మెన్ సరిత అన్నారు.శనివారం సిఎన్జి ఫంక్షన్ హాల్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలోబాగంగా సుపరిపాలన దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తో కలిసి కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ గతంలో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకుని తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చుకుని ప్రజల వద్దకు పాలన తెలంగాణా ముఖ్య మంత్రి తీసుకువచ్చినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలు నిర్మించుకొని ప్రజలకు మరింత సేవలు చేరువైనట్లు తెలిపారు. రాజధానిలో నూతన సెక్రటేరియట్ ఏర్పాటు చేసి దానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ దగ్గరగా ఉండటం వల్ల పరిపాలన మరింత సులువుగా ఉండి ప్రజలకు సమస్యలు తీరతాయని అన్నారు. గద్వాల జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ఈ నెల 12న ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నందున హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉంటే ప్రభుత్వం మరింత ప్రజల దగ్గరకు చేరుతుందని అన్నారు. ఈరోజు వివిధ శాఖల నుండి ఉత్తమ ఉద్యోగులుగా అవార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగులు కృషిచేసి జిల్లాలో మరింత అభివృద్ధి చేస్తారని ఆమె కోరారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సంక్షేమం కొరకు తీసుకు రావడం జరిగిందన్నారు. అట్టి సంక్షేమ ఫలాల ఫలితమే ఈరోజు దశాబ్ది ఉత్సవాలలో విజయాలుగా చెప్పుకుంటున్నామని అన్నారు. ఇంటింటికి త్రాగునీరు, సాగు విస్తీర్ణం పెరగడం, హెల్త్ పారామీటర్స్ ఇంప్రూవ్ కావడం ఇవన్నీ చూస్తున్నామని తెలిపారు. నేడు 21 రోజులపాటు ఆయా శాఖలు సాధించిన ప్రగతిని తెలుసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా జూన్ 8 న రైతు పండుగలు, చెరువుల దగ్గర పండుగలు జరిపుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు ప్రజాప్రతినిధులు రైతులు అధికారులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జరుపుకోవాలని హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈరోజు సుపరిపాలన గురించి మాట్లాడుతున్నామంటే ఉద్యోగులు అంకితభావంతో పనిచేసే జిల్లాను ముందుకు తీసుకురావాలన్నారు. ఉద్యోగుల అనుభవం, వారి నైపుణ్యతను బట్టి ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. తమ సమస్యలు ఏ అధికారి దగ్గరికి వెళితే పరిష్కారం అవుతాయో ప్రజలు తెలుసుకునే రీతిలో ఉద్యోగులు పనిచేయాలన్నారు. సమస్యతో వచ్చిన వ్యక్తులకు మీరు పరిష్కరించే విధంగా పనిచేయాలని, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నందున మాత్రమే మీకు అవకాశం ఉన్నదని తెలిపారు. ఈనెల 12న ఐడిఓసి భవనం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రారంభిస్తున్నందున ఇకనుండి అందరం ఒకే చోట ఉండి పనిచేస్తామని అధికారులకు అభినందనలు తెలిపారు. బాలబవన్ విద్యార్థులు నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తెలంగాణా ప్రభుత్వం అందించిన సుపరిపాలనకు సంబంధించి డాక్యుమెంటరి ని ప్రదర్శించారు.ఈ సందర్బంగా పరిపాలన లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంశా పత్రాలు అందజేశారు.సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్, ఆర్ డి ఓ రాములు, వడ్డేపల్లి మున్సిపల్ చైర్మెన్ అరుణ, ఎస్ ఇ శ్రీనివాస రావు, జిల్లా అధికారులు , తహసిల్దార్లు సంబందిత అధికారులు పాల్గొన్నారు.




