ఖమ్మం గ్రామీణం: ఖమ్మం గ్రామీణ మండలం ఎమ్.వెంకటయ్యపాలెంలో కన్నకూతుర్నే ఓ తండ్రి గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం….. కొండా మమత (20) గత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని ప్రేమిస్తుందనే అనుమానంతో తండ్రి వేరే పెళ్లి చేయాలని బావించాడు. ఈ నేపథ్యంలో వచ్చిన పెళ్లి సంబంధాలను కుమార్తె నిరాకరించడంతో అగ్రహించిన తండ్రి శనివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న మమతను గొడ్డలితో నరికి హతమార్చాడు. మృతదేహాన్ని గదిలోనే ఉంచి తాళం వేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.




