ధర్మపురి :జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం లోని జైన గ్రామానికి చెందిన గుడ్ల విజయ్ కుమార్ తన తండ్రి గుడ్ల సత్య నారాయణ, తన సోదరుడు గుడ్ల శ్రీకాంత్ జ్ఞాపకార్థం సుమారు మూడు లక్షల రూపాయలకు పైగా విలువ కలిగిన అంచనా వ్యయంతో.. ధర్మపురి మండలం లోని రాజారాం గ్రామంలో గల స్థానిక శ్రీ లక్ష్మీ వెల్డింగ్ షాప్ యజమాని అయినా దామెర కోండ శ్రీనివాస్, ధర్మపురి పట్టణ కేంద్రానికి చెందిన పెయింటర్ మహ్మద్ మతిన్ సహాయ సహకారంతో.. నూతనంగా వైకుంఠ రథంను తయారు చేయించారు. గుడ్ల విజయ్ కుమార్ శుక్రవారం ఉదయం వేళలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా వ్యాధి వ్యాప్తి చెందిన తరుణంలో ఎవరు అయినా సరే మరణిస్తే అంతిమ సంస్కార కార్యక్రమాలు చేయడానికి కానీ మృతి చెందిన వారి పాడే మోయడానికి కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు, కరోనా వ్యాధి రాక ముందు తల ఓ చేయి వేసి అంతిమ సంస్కారాలు చేయడానికి కానీ మృతి చెందిన వారి పాడేను మోయడానికి కానీ చాలా మంది యువత కానీ పెద్ద వారు కానీ ధైర్యంగా ముందుకు వచ్చే వారు, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు అని మా కుటుంబ సభ్యుల కోరిక మేరకు.. నా సన్నిహితులు, స్నేహితులు, మిత్రుల సలహాలు సూచనల మేరకు.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాకు మా కుటుంబ సభ్యులకు చాలా సంతృప్తికరంగా ఉంది అని గుడ్ల విజయ్ కుమార్ మీడియాకు తెలుపుతూ.. ప్రస్తుతం ఈ వైకుంఠ రథం పనులు తుది దశకు చేరుకోవడంతో.. చివరగా వైకుంఠ రథం నకు తుది దశ పనులలో భాగంగా మెరుగులు దిద్దుతున్న కారణంగా అనుకున్న సమయానికి వైకుంఠ రథం పనులను పూర్తి చేసి వారం రోజుల లోనే వైకుంఠ రథంను మా చేతికి అందిస్తున్న వెల్డర్ దామెర కోండ శ్రీనివాస్ పెయింటర్ మహ్మద్ మతిన్ లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ.. త్వరలోనే ఈ వైకుంఠ రథంను మా జైన గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తామని ఆయన ఘనంగా మీడియాకు తెలిపారు. తన తండ్రి గుడ్ల సత్య నారాయణ చనిపోయిన రోజున ఆయన ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకోని మే నేల పన్నెండవ తేది శుక్రవారం రోజున జైన గ్రామ ప్రజలకు అందజేయనున్నట్టు గుడ్ల విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఇట్టి కార్యక్రమ నిర్వహణ సందర్భంగా గుడ్ల విజయ్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న సహసోపెతమైన నిర్ణయానికి జైన గ్రామ ప్రజలు అందరు సంతోషం వ్యక్తం చేస్తూ తీవ్ర హర్షం చేస్తున్నారు. గుడ్ల విజయ్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న సామజిక సేవా కార్యక్రమాలను కోనియాడుతూ.. భవిష్యత్తులో వారు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించాలని వారు కోరుకుంటున్నారు. గుడ్ల విజయ్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులను, స్థానిక జైన, కోసునూర్ పల్లె గ్రామాలకు చెందిన కల్కి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువత, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీడియా మిత్రులు, తదితరులు ఘనంగా అభినందనలు తెలుపుతూ.. ఘనంగా అభినందిస్తున్నారు.




