దండేపల్లి. జనంసాక్షి 04 దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దండేపల్లి ఎంపిపి గడ్డం శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాంతన్న, ఉప సర్పంచ్ ఇప్ప రమేశ్,సర్పంచుల పోరం అధ్యక్షులు డాంక లక్ష్మణ్, మాజీ వైస్ ఎంపిపి ఆకుల రాజేందర్, ఎంపిటిసి ముతే రాజన్న,బిఆర్ఎస్ నాయకులు ఇప్ప రమేశ్, ఇప్ప కిష్టయ్య,పులిశెట్టి రాజయ్య.ఇప్ప.రాజిరెడ్డి. మన్నే రవికుమార్. గడ్డం రాంచందర్,నలిమెల మహేష్, పత్తిపాక సంతోష్ తదితరులు పాల్గొన్నారు





