తనపై వచ్చిన ఫిర్యాదులు ఉద్దేశపూర్వకం గా చేసినవి
డాక్టర్ జగన్ రెడ్డి
మిర్యాలగూడ. జనం సాక్షి
పేషెంట్లు చూసే విషయంలో తనపై వచ్చిన ఫిర్యాదులు కొందరు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవని డాక్టర్. ఏ.జగన్ రెడ్డి అన్నారు.మంగళవారం స్థానికంగా విలేకరుల తో మాట్లాడుతూ ఈ నెల 8 వ తేదీన ఏరియా ఆసుపత్రి లో చేరిన ఒక రోగి కి చికిత్స పూర్తి అయిన తర్వాత సీ టీ స్కాన్ పరీక్షల కోసం బయటకి వెళ్తుండగా ఆసుపత్రి ముందు ఉన్న ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్ నెల్లూరు రమేష్. వార్డ్ బాయ్ బాసీత్ లు కలసి కావాలని తనపై ఫిర్యాదు చేయించారని వివరించారు.. కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల వారు ఇచ్చే కమిషన్ కు కక్కుర్తి పడి ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. తన డ్యూటీ లో రోగి ని ప్రైవేట్ ఆసుపత్రి కి సిఫారసు చేయనని అందుకే ఇలా చేసారని అన్నారు. సదరు ఫిర్యాదు దారుని నుండి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నామని వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు