ప్రియాంక చతుర్వేది ఫోటకు బదులు నటి ప్రియాంక ఫోటో
మండిపడ్డ నెటిజన్లు
న్యూఢిల్లీ,జూలై13(జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీ మరోసారి తప్పులో కాలేసింది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించేందుకు ఓ పాత వీడియోను పోస్టు చేస్తూ తాజా వీడియోగా చెప్పిన కాంగ్రెస్ తర్వాత అందుకు క్షమాపణలు చెప్పింది. ఇప్పుడు ఓ ట్వీట్‌ను కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేదికి ట్యాగ్ చేయబోయి.. ఏకంగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు ట్యాగ్ చేసింది. పొరపాటును గ్రహించిన అనంతరం కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. ‘భూపరీక్షా కేంద్రాల గురించి ప్రధాని మోదీ అన్నీ అబద్దాలు చెబుతున్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 1141 భూపరీక్షా కేంద్రాలు ఉన్నాయి’ అని కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ ప్రియాంకచోప్రా ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేసింది. ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ నటికి కాంగ్రెస్‌కు సంబంధం ఎలా వచ్చిందా? అని అనుకున్నారు. పొరపాటును గ్రహించిన కాంగ్రెస్ వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. గత వారం కూడా కాంగ్రెస్ ఇదేమాదిరిగా పొరపాటు చేసింది. ప్రధాని మోదీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఓ పాత వీడియోను పోస్టు చేసి తాజా వీడియోగా చెప్పింది. అనంతరం అది పాత వీడియో అని గ్రహించిన కాంగ్రెస్ అందుకు క్షమాపణలు చెప్పింది.




