Wednesday, 4 November 2026

తలసాని వ్యవహారంపై టీటీడీపీ మళ్లీ పోరుబాట

హైదరాబాద్, ఆగస్టు 24 : తలసాని రాజీనామా వ్యవహారంపై టీటీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి తెలంగాణ స్పీకర్‌ను కలవాలని నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ మధుసూదనాచారితో సమావేశంకానున్నారు. తలసాని రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని మరోసారి స్పీకర్ను కోరనున్నారు.
తలసాని రాజీనామాకు సంబంధించి రెండు, మూడు సార్లు స్పీకర్‌ను టీడీపీ ఎమ్మెల్యే కలిసిన విషయం తెలిసిందే. 20 రోజుల క్రితం స్పీకర్‌ను కలిసిన సమయంలో దీనిపై మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.
ఈ క్రమంలో ఈరోజు మరోసారి స్పీకర్‌ను కలిసి గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా మధ్యాహ్నం రెండు గంటలకు టీడీఎల్పీ కార్యాలయంలో భేటీ అనంతరం స్పీకర్‌ను కలువనున్నారు.

v

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *