కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 01మారేడ్ పల్లిలోని మున్సిపల్ గ్రౌండ్ లో జిహెచ్ఎంసిఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వివిధ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు.ఇటీవలనే మండల స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు సిఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించిన విషయాన్ని వివరించారు.వేసవి సెలవులలో విద్యార్ధులు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27 వ తేదీ నుండి 6 నుండి 16 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్ధినీ విద్యార్ధులకు వివిధ క్రీడలలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. తరచుగా క్రీడలలో పాల్గొనడం వలన మానసికంగా,శారీరకంగాఎంతోఉత్సాహంగా,దృడంగా తయారవుతారని పేర్కొన్నారు.జాతీయ,అంతర్జాతీయ స్థాయిలలో రాణించే క్రీడాకారులను తగిన విధంగా గౌరవిస్తూ మరింతగా ప్రోత్సహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని వివరించారు. విద్యార్ధులు ఇప్పటి నుండే మంచి క్రీడాకారులుగా అభివృద్ధి సాధించే లా కృషి చేయాలని,తల్లిదండ్రులు కూడా వారిని అదేవిధంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్ధులకు మంత్రి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,డిప్యూటీ కమిషనర్ లు ముకుంద రెడ్డి, వేణుగోపాల్, మోoడా డివిజన్ కార్పొరేటర్ దీపిక నరేష్, స్పోర్ట్స్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, కుమార్, క్రీడాకారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




