Tuesday, 3 November 2026

నా జీవితం ప్రజాసేవకే అంకితం ప్రజాభిప్రాయం మేరకు ఎమ్మెల్యేగా పోటీచేస్తా వికారాబాద్ నియోజకవర్గ అభివృద్దే ముఖ్యం ది లైట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తుప్ప ఆనంద్

 

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ జూన్ 1 జనం సాక్షిప్రజాభిప్రాయం మేరకు రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ది లైట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు తుప్ప ఆనంద్ అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా మా కుటుంబం మోమిన్ పేట్ ప్రజలకు చిరకాలం సేవలు అందించిందని స్పష్టం చేశారు. గురువారం ది లైట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు తుప్ప ఆనంద్ విలేకరులతోమాట్లాడుతూ, వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేయాలనే ప్రగాఢ లక్ష్యంతో రాజకీయ అరంగ్రేటం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తన తండ్రి మోమిన్ పేట గ్రామ సర్పంచ్ గా తెలంగాణ తొలి దశ ఉద్యమంలో స్వర్గీయ చెన్నారెడ్డితో కలిసి తొలి దశ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడని మలిదశ ఉద్యమంలో నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ప్రజలను యువకులను చైతన్యవంతం చేశాడని ఆయన అడుగుజాడల్లోని రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించాను అన్నారు ప్రజా క్షేత్రంలో అనునిత్యం ఉండాలనే లక్ష్యంతో ది లైట్ ఫౌండేషన్ స్థాపించానని ఆన్నారు. వృత్తి వైద్యమైనప్పటికీ ప్రవృత్తి సామాజిక సేవలో తరించాలని తహతహలాడుతున్నారు. ది లైట్ ఫౌండేషన్ ద్వారా క్రీడలకు ప్రోత్సాహం, యువతకు దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించడం, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం వంటి పలు సామాజిక కార్యక్రమాలలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వైద్య వృత్తితో కొందరికే సేవచేసే భాగ్యం కలుగుతుందని అదే రాజకీయాలలోకి రావడం వలన ఎక్కువ మందికి సేవ చేసే అదృష్టం వస్తుందని అన్నారు. అన్ని సామాజిక వర్గాలలోనే పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. మా నాన్న తుప్ప రామయ్యను ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని ప్రగాఢమైన ఆకాంక్ష మేరకు రాజకీయాలలోకి రావడం జరుగుతుందని అన్నారు. వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తానని అన్నారు. వికారాబాద్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందేలా చేస్తానని పేర్కొన్నారు. నా జీవితం ప్రజాసేవకే అంకితమని, వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి వికారాబాద్ నియోజకవర్గ ప్రజల సేవ చేస్తానని అన్నారు.