తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య
ఆదిలాబాద్, మార్చి 20: తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థిని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని కడెం మండలం కొండుకూర్లో శుక్రవారం జరిగింది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఘనటపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.