తవకల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 28 (జనం సాక్షి)

మిలాద్ ఉన బి సందర్భంగా గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని శంభునిపేటలో గల ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో తవకల్ సొసైటీ చైర్మన్ ఎంఏ జబ్బర్ ఆధ్వర్యంలో రెండువందల మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జబ్బర్ మాట్లాడుతూ తమ సొసైటీ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.