తహశీల్దార్ కార్యాలయం ముందు ఒక్కరోజు నిరాహార దీక్షతహశీల్దార్ కార్యాలయం ముందు ఒక్కరోజు నిరాహార దీక్ష
ధర్మపురి 30 ( జనం సాక్షి న్యూస్ )జగిత్యాల జిల్లా ధర్మపురి లో బుధవారం ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో వ్యవసాయ,ధరణి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో సీనియర్ నాయకుడు ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ కు పూలమాల వేసిన తదనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ ఒక్కరోజు నిరాహార దీక్ష తహశీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగిత్యాల జిల్లా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారికి నిమ్మరసం అందించి దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు మరియు అభిమానులు రైతులు పాల్గొన్నారు.
తహశీల్దార్ కార్యాలయం ముందు ఒక్కరోజు నిరాహార




