Monday, 2 November 2026

పేదింటి ఆడబిడ్డలకు మేనమామగా సీఎం కేసీఆర్పేదింటి

పేదింటి ఆడబిడ్డలకు మేనమామగా సీఎం కేసీఆర్పేదింటి ఆడబిడ్డలకు మేనమామగా సీఎం కేసీఆర్
*ఉప్పరగూడెం సర్పంచ్ దుంపల జమున సమ్మయ్య
పెద్దవంగర  నవంబర్30 (జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన   టిఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ దుంపల జమున సమ్మయ్య అన్నారు. బుధవారం ఉప్పరగూడెం గ్రామంలో లబ్బి దారులు కట్టోజు సరస్వతి,కాటోజు పూలమ్మ,పెంతాల స్వరూప, మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దుంపల జమున సమ్మయ్య చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా,అన్నగా ఎంతోమంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారాన్ని తగ్గిస్తున్నారని,ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.ఇన్ని  పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని,కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తుందని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం,కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెళ్లి చేసే వరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని,ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లస్కర్ వార్డు సభ్యులు నీలం రవళి, సంతోష్,ఓరుగంటి చిన్న యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.