Friday, 6 November 2026

తహసిల్దార్ కు మెమోరాండం కిసాన్ మోర్చా నాయకులు

తహసిల్దార్ కు మెమోరాండం
కిసాన్ మోర్చా నాయకులు.

ఖమ్మం తిరుమలాయ పాలెం (డిసెంబర్ 9) జనం సాక్షి.

ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా లక్ష రూపాయలు వ్యవసాయ రుణమాఫీ హామీ వడ్డీతో సహా సంపూర్ణంగా అమలు చేయాలి, కిసాన్ మోర్చా నాయకులు తహసిల్దార్ పుల్లయ్యకు వినతి పత్రం శుక్రవారం అందజేశారు .
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన( పంటల బీమా యోజన) తెలంగాణలో అమలు చేయకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, అని వారు ఆవేదన చెందారు. వెంటనే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రీమియం చెల్లించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలి,
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మద్దతు ధర ఇచ్చి సహకరిస్తున్న,
నేటి వరకు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడమే కాక హమాలీ పైసలు కేంద్రం ఇస్తున్న, రైతుల వద్ద వసూలు చేయడం దురదృష్టకరమన్నారు. తరుగు తాలు పేరుతో నిబంధనలకు విరుద్ధంగా రైతులను నష్టపరుస్తున్నారు, వారు తెలిపారు .రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హమాలీ చార్జీలు రైతులు వద్ద వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలి ,అలాగే తాలూ తరుగు పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నష్టం జరగకుండా చేయాలని కోరారు .
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వలన వేలాది మంది రైతులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ప్రభుత్వ తప్పిదానికి రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తుంది, అని వారు దుయ్య బట్టారు వెంటనే ధరణి పోర్టను సమీక్షించి రైతుల ఇబ్బందులు తొలగించాలని బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమoలో మండల అధ్యక్షులు బొడ్డుపల్లి ప్రసాద్. జిల్లా ఉపాధ్యక్షులు గుండా శ్రీనివాసరెడ్డి .. పాలేరు అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి ..ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్ బీజేవైఎం మండల అధ్యక్షులు గంట్ల లక్ష్మారెడ్డి.సురేష్ .మహేష్.రాము తది తరులు పాల్గొన్నారు