తెలంగాణ పై కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తే నాలుక చీరేస్తం
మోత్కూరు డిసెంబర్ 9 జనంసాక్షి : అరవై సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతిన్న ఆంధ్రా నాయకులు నైజం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్న ఇంకా వైసీపీ నాయకులు తెలంగాణ పై కుట్రపూరితమైన రాజకీయ చర్యలు చేయడం సిగ్గు చేటని ఏ ఆంధ్రా నాయకుడైన ఎవడైనా మళ్లీ తెలంగాణను కలుపుతాం అని వాగితే వారి నాలుకను చీరుస్తామని మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొనతం యాకూబ్ రెడ్డి అన్నారు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల సహకారాన్ని 14 సంవత్సరాల శాంతియుత ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణను మళ్ళీ కలుపుతామంటే తెలంగాణ పోలిమేర కూడా దాటానియకుండా చేస్తామని వారు పేర్కొన్నారు. చిల్లర మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, నాయకులు జంగ శీను, దాసరి తిరుమలేష్, కూరేళ్ల దాసు లు పాల్గొన్నారు




