తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాలి కులస్తుల ధర్నాతహసీల్దార్ కార్యాలయం ఎదుట మాలి కులస్తుల ధర్నా
చింతలమానేపల్లి జనంసాక్షి :మండలంలోని ధరంపల్లి గ్రామస్తులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం రోజున ధర్నా చేపట్టారు. అర్క గూడ ప్రాజెక్ట్ ముంపునకు గురైనందుకు ఆరు సంవత్సరాల క్రితం తమకు డబ్బా క్రాస్ రోడ్డు వద్ద ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించందన్నారు. ఇందులో భాగంగా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి విగ్రహాలకు కూడా భూమిని కేటాయించారని తెలిపారు. కాగా విగ్రహాల చుట్టూ వేసిన స్తంభాలను కొంతమంది వ్యక్తులు తొలగించారని. ఎమ్మార్వో, ఆర్.ఐ స్తంభాలు తొలగించిన వారికి మద్దతు ఇస్తున్నారని వారు ఆరోపించారు. విగ్రహాలకు కేటాయించిన భూమి హద్దులను ధ్వంసం చేసిన వ్యక్తుల పై కఠినంగా చర్యలు వారు డిమాండ్ చేశారు. ఎమ్మార్వో ముస్కార్ అలీ మాట్లాడుతు ఆ భూమిని గవర్నమెంట్ అధీనంలో తీసుకున్నామన్నారు. సమస్యను రెండు రోజులలో పరిష్కరిస్తామన్నారు. పోలీస్ ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చచెప్పి వారి అక్కడినుండి పంపించారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాలి కులస్తుల




