పంటలను పరిశీలించిన వ్యవసాయ అదికారులు
జుక్కల్, నవంబర్ 30, జనం సాక్షి,
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో బుధవారము ఏడిఏ నూతన్ కుమార్ పంటలను పరిశీలించారు. రైతులకు తగు సూచనలు చేశారు.పంటలకు రోగాలు వస్థే కొందరు రైతులు పురుగు మందుల దుకాణదారుల సలహామేరకు మందులు కొనుగోలు చేసి పంటలకు వాడుతున్నారని అలా చేయవద్దని తెలిపారు. వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని తెలిపారు.విత్తనాలు, పురుగుమందులు,ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈవో సునంద, రైతులు పాల్గొన్నారు
పంటలను పరిశీలించిన వ్యవసాయ అదికారులు




