తాండూర్ నియోజకవర్గంలో ఎస్సి భవనాలు ఏర్పాటు చేయండి.
తాండూర్ లో బిసి, గిరిజన భవనాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడo హర్షణియo.
యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమయ్య.
తాండూరు నవంబర్ 28(జనంసాక్షి)తాండూర్ నియోజకవర్గంలో ఎస్సి భవనాలు ఏర్పాటు చేయాలని యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాండూర్ లో బిసి, గిరిజన భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం హర్షణియమని, ఈ సందర్భంగా సిఏం కేసిఆర్,ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాండూర్ నియోజకవర్గంలో తాండూర్ పట్టణం తో పాటు బషిరాబాద్, తాండూర్, యాలల్, పెద్దెముల్ మండలాల పరిధిలో 22 శాతం దళితులు ఉన్నారని. దళితుల కోసం ఎస్సి భవన్ లను ఏ
ర్పాటు చేయాలని కోరారు. మరొకవైపు తాండూర్ నియోజకవర్గంలో నేటి వరకూ ఎస్సి భవనాలు రూపాంతరం చెందలేదని అన్నారు. ఎమ్మెల్యే స్పందించి.ఎస్సి భవనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా భీమయ్య విజ్ఞప్తి చేశారు.
తాండూర్ నియోజకవర్గంలో ఎస్సి భవనాలు ఏర్పాటు చేయండి




