Friday, 6 November 2026

పురపాలక సంఘ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుక

పురపాలక సంఘ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుక హుజూర్ నగర్ నవంబర్ 28 (జనం సాక్షి): పురపాలక సంఘ కార్యాలయం నందు హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి జన్మదిన వేడుకలు ఘనముగా నిర్వహించటం జరిగిందన్నారు. అనంతరం చైర్పర్సన్ గెల్లి అర్చనరవి పట్టణంలోని అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. సోమవారం పురపాలక సంఘ మెప్మా సిబ్బంది కార్యాలయములో కేక్ కట్ చేయించడం జరిగిందన్నారు. అనంతరం గెల్లి అర్చనరవి పురపాలక సంఘ పారిశుద్ద్య కార్మికులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమములో పురపాలక సంఘ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వర రావు, వార్డు కౌన్సిలర్లు, పురపాలక సంఘ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్ పి లు పాల్గొన్నారు.