తాగునీటి అవసరాలకు సాగర్ కుడికాల్వలకు నీరు విడుదల
నల్గొండ: నాగార్జున సాగర్ కుడికాల్వకు తాగునీటి అవసరాల కోసం 6వేల క్యూసెక్కుల నీటిని విడుదలచేశారు. ఈ నీటితో గుంటూరు. ప్రకాశం జిల్లాల్లోని తాగునీటి చెరువులను నింపనున్నారు. సాగర్ జలాశయ ప్రస్తుత నీటి మట్టం 518.30 అడుగులు ఉంది. మరో వారం రోజుల్లో సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల చేసే అవకాశాలున్నాయని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.