Saturday, 14 November 2026

తాగునీటి కోసం గ్రామస్థుల ఆందోళన

దేవునిపల్లి: కామారెడ్డి మండలం దేవుని పల్లిలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు శనివారం ఉదయం గ్రామస్థులు ఎల్లారెడ్డి రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లడుతూ గ్రామంలోని సాయిసద్గురు కాలనీలో ఆరు నెలలుగా నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈ సమస్యపై గ్రాయ ప్రత్యేకధికారి, కార్యదర్శికి విన్నవించిన స్పందన కరువైందని పేర్కొన్నారు. సుమారు అర గంల పాటు గ్రామస్థులు, మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డు పై అరకిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. కాలనీ వాసులు వేణుగోపాల్‌, నారాయణ గోపిచారి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *