తాగునీటి సమస్య లేకుండా చూడాలి
బీరుకూర్ గ్రామీణం: మండలంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆర్డీవో మోహనరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు తక్కువగా జరుగుతున్నాయని, ప్రతి కూలీకి పని కల్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద ఎంపికైనా 5 గ్రామాల ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకునేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వత్సలదేవి, ఏవో కమల, తహశీల్దార్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.