రఘునాథ పాలెం జనవరి 24 జనం సాక్షి
బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అద్యక్షుడు & ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సోదరుడు తాతా విశ్వేశ్వరరావు, నాగమణి దంపతుల కుమారుడు తాతా నిఖిల్ మృతి చెందాగా నేడు తిరుమలయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలోని వారి నివాసమునకు వెళ్లి వారి కుటుంబాన్ని రఘునాథపాలెం మండలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు.
వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం నిఖిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మద్దినేని వెంకటరమణ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మందడపు. నరసింహారావు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్
పిన్ని. కోటేశ్వరరావు మార్కెట్ వైస్ చైర్మన్ కొంటెముక్కుల. వెంకన్న, సర్పంచుల సంఘము అధ్యక్షుడు మాధంశెట్టి. హరి ప్రసాద్, సర్పంచ్ లు మెంటం రామారావు చెరుకూరి ప్రదీప్‌కుమార్ నాయకులు నున్న. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




