కొడకండ్ల, జనవరి24(జనంసాక్షి)
తెలంగాణ మహిళల సాధికారత, ఆర్థిక ఎదుగుదల లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ
మహిళలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించే కుట్టు మిషన్ల పథకాన్ని ప్రారంభిచిననుదుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారని,
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదు అన్నారు.
మన దగ్గర అమలయ్యే పథకాలు అక్కడ ఎక్కడా లేవు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కొన్ని ఉన్నాయి.
రైతు బంధు, 2000, 3000 రూపాయల పెన్షన్లు, కళ్యాణ బంధు, ఇంటింటికి నీళ్ళు దేశంలో ఎక్కడా లేవు అని అన్నారు.
ఇంటింటికి నీటి కోసం 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ తెచ్చారని,
రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. రైతు పండించిన పంట అంతా కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ అని ప్రతి గింజ కొంటున్న మహానుభావులు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
ష్యురిటి లేకుండా మహిళకు స్త్రీ నిధి ద్వారా రుణాలు ఇస్తున్నారు.కుట్టు మిషన్
పథకం ద్వారా ఒక్కొక్కరికి 17వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని,మొదటగా పాలకుర్తినియోజకవర్గంలోనే పెట్టామని,
ఈ పథకం కింద పాలకుర్తి నియోజకవర్గంలో 3వేల మందికి45 రోజుల శిక్షణ ఇస్తామని,ఆ తర్వాత స్కూల్ డ్రెస్సెస్,ప్రభుత్వ బట్టలన్నీ వీరికి ఆర్డర్ ఇస్తామని అన్నారు.
టెక్స్ టైల్ పార్కు లో లక్ష మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ తక్షణం 10వేల మంది కుట్టు మిషన్ వచ్చిన వారు కావాలి అని
అయితే కనీసం 10వ తరగతి పాసై ఉండాలి అని పదో తరగతి అర్హతగా పెట్టడం జరిగింది అని తెలిపారు.
ఈ శిక్షణ తరవాత ఉద్యోగం చేస్తాం అన్నవాళ్లకు అక్కడ ఉద్యోగం పెట్టిస్తామని. ఇంటి దగ్గర పని చేసే వారికి ప్రభుత్వ బట్టల ఆర్డర్ ఇస్తామని ఈ
పథకాన్ని సద్వినియోగం చేసుకోని కుటుంబానికి అండగా నిలబడాలని,
శిక్షణలో తప్పకుండా హాజరై స్కిల్స్ నేర్చుకోవాలి అన్నారు.అలాగే సోలార్ పవర్ పథకాన్ని కొడకండ్లలో ప్రారంభించడం జరిగింది.
స్త్రీ నిధి ద్వారా ప్రోత్సహిస్తున్నదీనివల్ల మీకు ఉచిత కరెంట్ వస్తుందని
అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఇది మహిళకు ఇచ్చే ప్రత్యేక పథకం అని తెలిపారు.ఈ
కార్యక్రమం అనంతరం కొడకండ్ల రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, డి. ఆర్. డి. ఏ రామ్ రెడ్డి,
డీసీసీబీ వైస్ ప్రెసిడెంట్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ జ్యోతి, ఎ ఎం సి చైర్మన్ రాము,స్థానిక సర్పంచ్ మధుసూదన్, జిల్లా రైతు సమన్వయ సభ్యులు సిందె రామోజీ ,ఎంపీటీసీ 2 కుందురు విజయలక్ష్మి అమరేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు,ముఖ్య నాయకులు అధికారులు,మహిళలు తదితరులు,పాల్గొన్నారు.




