Thursday, 5 November 2026

తాత్కాలిక రాజధానిపై ఉద్యోగుల విముఖత

వసతులు లేకుండా ఎలా వెళతామని మంత్రికి ప్రశ్న
హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి):  ఉద్యోగ సంఘాల నాయకులతో ఆంధప్రదేశ్‌ మంత్రి నారాయణ సోమవారం  సచివాలయంలో సవిూక్ష నిర్వహించారు. తాత్కాలిక రాజధానికి శాఖల తరలింపు అంశంపై ఆయన వారితో చర్చించారు. హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉందని, శాఖల తరలింపునకు ఇప్పుడే తొందరేముందని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మౌళిక వసతులు లేకుండా అక్కడికి ఎలా వెళతామన్‌ఆనరు. తాత్కాలిక రాజధానికి వెళ్లేందుకు మానసికంగా సిద్ధంగా లేమని వారు స్పష్టం చేశారు. తమ పిల్లల భవిష్యత్‌తోపాటూ ఇతరత్రా సమస్యలు ఉన్నట్లు ఉద్యోగులు మంత్రికి తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఉద్యోగులను మానసికంగా సిద్ధం చేయమని మాత్రమే సీఎం చెప్పారన్నారు. ఉద్యోగుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. హెచ్‌ఆర్‌ఎ, ఆసుపత్రి సౌకర్యం, పిల్లలకు స్కూళ్లు, ఉద్యోగులకు గృహవసతి తదితర విషయాల్లో వారు తమ అభ్యంతరాలను అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో  ఎపి తాత్కాలిక రాజధాని ప్రతిపాదనకు ఎన్‌.జి.ఓ.ల నుంచి వ్యతిరేకత వచ్చింది. హైదరాబాద్‌ నగరం తాత్కాలిక రాజధానిగా ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు కొత్తగా మరో తాత్కాలిక రాజధాని ఏర్పాటు ఎందుకు అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి నారాయణ చర్చలు జరిపినప్పుడు అనేక అంశాలను చర్చించారు.  తాత్కాలిక రాజధానికి వెళ్లాలంటే అక్కడ మౌలిక సదుపాయాలు లేకుండా,స్కూళ్లు లేకుండా వెళ్లి ఏమి చేస్తామని అన్నారు. పైగా తాత్కాలిక రాజధానిగా ఉండగా, కొత్తగా భారీ ఖర్చుతో తాత్కాలిక రాజధాని నిర్మాణం ఎందుకు అని వారు అడిగారు. ఉద్యోగుల తరలింపు అంటే కేవలం ఉద్యోగులు మాత్రమే కాదని, ఫైళ్ళు,రికార్డులు కూడా మార్చాలని, వాటికి భద్రత కొరవడే అవకాశం ఉంటుందని వారు హెచ్చరించారు. హైదరాబాద్‌ లో చదవుఉతున్న తమ పిల్లలకు స్థానికత వర్తింప చేయవలసి ఉంటుందని వారు స్పష్టం చేశారు. మొత్తం విూద ఎపి ఎన్‌.జి.ఓనేత అశోక్‌ బాబు తాత్కాలిక రాజధానికి అనుకూలంగా ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడితే హైదరాబాద్‌ లో మాత్రం ఎన్‌.జి.ఓ నేతలు వ్యతిరేకంగా మాట్లాడడం విశేషం. ఇదిలావుంటే ఈ విషయాలను పరిగణించి ముందుకు వెళతామని మంత్రి నారాయణ అన్నారు. ఇక్కడ ఉండి పాలన సాగించడం ఇబ్బందిగా ఉందన్నారు. రాజధాని 2018లో అందుఏబాటులోకి వస్తుందని అప్పటి వరకు అందరం ఇక్కడి నుంచే పాలన సాగించడం కుదరదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *