తాయో సీడ్స్ రెడ్ హాట్ తో అధిక దిగుబడులు
-రెడ్ హాట్ సీడ్ పై రైతు క్షేత్ర ప్రదర్శన
-తాయో సీడ్స్ ఆర్ఎం వేణు గోపాల్ రావు
మహబూబాబాద్ బ్యూరో-డిసెంబర్10(జనంసాక్షి)
తాయో సీడ్స్ వారి రెడ్ హాట్ అనే కొత్తరకం మిరప సీడ్ తో అధిక దిగుబడులు పొందవచ్చని తాయో సీడ్స్ ఆర్ఎం వేణుగోపాల్ రావు అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని దేశ్య తండాకు చెందిన రైతు మలోత్ మంగిలాల్ వ్యవసాయ భూమిలో 300లకు పైగా రైతులకు రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను సైతం తట్టుకుని ముడుత, తెగులను తట్టుకుని అధిక రోగ నిరోధక శక్తిని కలిగి కాయ మంచి రంగుని, పొడవును కలిగి అధిక దిగుబడిని అందించేందుకు రెడ్ హాట్ సీడ్ బాగా ఉపయోగపడుతుందని మంగిలాల్ పంటను చూపిస్తూ ఆయన వివరించారు. మంచి వితనాలతోనే మంచి దిగుబడి వస్తుందని దేశానికి రాజైన రైతు ఆర్ధికంగా బలపడాలని కోరారు. పంట సాగుపై రైతులకు మిరప సాగుపై తీసుకోవాల్సిన మెళుకువలను వివరించారు. అనంతరం మంగిలాల్ ను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా డిస్టిబ్యూటర్ శ్రీ రామకృష్ణ సీడ్స్ తోట మహేందర్, కంపెనీ టీఎస్ఎం చెన్న శ్రీధర్, ఎఫ్ఎం రమేష్, వెంకటేష్, రైతులు పాల్గొన్నారు.




