Tuesday, 3 November 2026

తిమ్మంపేటలో శాస్త్రోప్తంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు

 

 

 

 

 

 

 

వరంగల్ ప్రతినిధి: మే 30(జనం సాక్షి)శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవస్థాన ధ్వజ స్థంభ పునః ప్రతిష్టాపన కార్యక్రమం తిమ్మంపేట లో మూడవ రోజు అభిషేకం, బొడ్రాయి వద్ధ గుమ్మడి కాయ పూజ, గరుడ యంత్రం నవధాన్యాల పూజ కార్యక్రమాలు స్థానిక సర్పంచ్ మూడో విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు.మంగళవారం దుగ్గండి మండలం తిమ్మంపేట లో నిర్వహించిన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మోడెం విద్యాసాగర్-ప్రశాంతి దంపతులు కలిసి శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ కార్యక్రమాల పూజ తంతును నిర్వహించారు. గ్రామములోని ప్రతి కుటుంబం నుండి గుమ్మడికాయ తీసుకువచ్చి వేద బ్రాహ్మణులచే పూజలు నిర్వహించుకుని స్వగృహాలకు తీసుకొని వెళ్లారు.ఈ కార్యక్రమంలో అర్చకుడు మరింగంటి ఆనంద్ కుమార్, మరింగంటి అరుణ్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు రాంకి, తిరుపతి పుణ్యక్షేత్రమును వచ్చిన వేద బ్రాహ్మణులు, కొండగట్టు ఆంజనేయ స్వామి నుండి వచ్చిన పురోహితులు, గ్రామ అన్నికులాల పెద్దమనుషులు సౌడారపు శోభన్ బాబు,దొనపాటి విజేందర్, సౌడారపు రాజు, తడుక సందీప్, తోటకూరి నాగరాజు, వార్డ్ మెంబర్ దాసి నవీన్, కో ఆప్షన్ మెంబర్ తోటకూరి శ్రీనివాస్,దండు రవి,పోశాల పానీ, ఏలిషోజు శ్రీనివాస్ చారి, పాలడుగుల రాజేందర్, కొలిపాక రాజుకుమార్, ఉండ్రాతి ఎల్లయ్య,మోడెం రాజమౌళి, దొనపాటి జెనార్దన్ రెడ్డి,సౌడారపు రవికుమార్, బీరం ప్రభాకర్ రెడ్డి,సౌడారపు బాలయ్య, పాలడుగుల చెంద్రమౌళి గంగాడి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.