జనం సాక్షిదుబ్బాకసిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో మున్సిపల్ కార్యాలయంలో భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో CSC హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో సిఐటియు సహకారంతో మండల పరిధిలోని భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా 132 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి జి.భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులందరికీ ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వల్ల కార్మికులకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రైవేటు కార్పొరేట్ వైద్యశాలలకు వెళ్తే అనవసరమైన పరీక్షలు నిర్వహించి కార్మికుల వద్ద నుంచి విచ్చలవిడిగా డబ్బులు లాగుతూ కార్మికులను మోసం చేస్తున్నాయని అలాంటి వాటి నుండి భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ మండలంలో మిగిలిపోయిన గ్రామాలలో గల కార్మికులందరికీ మరి కొన్ని రోజులు హెల్త్ క్యాంపు గ్రామాలలో నిర్వహించి అందరికీ పరీక్షలు నిర్వహిస్తామని సిబ్బంది తెలిపారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపును భవన నిర్మాణ కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని CSC హెల్త్ కేర్ సెంటర్ కోఆర్డినేటర్ నవీన్ విజ్ఞప్తి చేశారు. సిఐటియు నాయకులు మరియు మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి గారు మరియు సిబ్బంది మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత భూమి రెడ్డి గారు సహకరించారని వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో CSC హెల్త్ క్యాంప్ జిల్లా కోఆర్డినేటర్ బాబూ,సెంటర్ కోఆర్డినేటర్ నవీన్, డాక్టర్ పూజిత,CITU దుబ్బాక టౌన్ కన్వీనర్ కంపెళ్ళి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నుండి కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.




