Thursday, 5 November 2026

తిమ్మప్ప స్వామి దేవాలయంలో అన్నదానం

తిమ్మప్ప స్వామి దేవాలయంలో అన్నదానం

 

మల్దకల్ నవంబర్ 12 (జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు తాటికుంట గ్రామానికి చెందిన పల్లా తిమయ్య శెట్టి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.ఆలయ చైర్మన్ పట్వారీ ప్రహల్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి, అర్చకుల,రవిఆచారి పూజలు నిర్వహించి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రావు,బ్యాంక్ నాగరాజు, బాదామి శ్రీనివాసుల, ప్రవీణ్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.