Thursday, 5 November 2026

తెలంగాణ రాష్ట్రానికి మోడీ చేసింది ఇసుమంత కూడా లేదు

తెలంగాణ రాష్ట్రానికి మోడీ చేసింది ఇసుమంత కూడా లేదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మోడీ కక్షపూరిత చర్యలు
తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ పాలన
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రేగొండలో విస్తృత పర్యటన… పలువురికి చెక్కుల పంపిణీ
రేగొండ జనంసాక్షి : తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ చేసింది ఇసుమంత కూడా లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపణలు వ్యక్తం చేశారు. మండలంలోని పొనగల్లు, మడతపల్లి, కొడవటంచ, లింగాల, రేపాక, రేపాక పల్లి, కనిపర్తి, దమ్మన్నపేట, పోచంపల్లి, రంగయ్యపల్లి, రూపురెడ్డిపల్లి, రేగొండ గ్రామాలలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణకు వస్తున్న మోడీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కరోనా కల్లోల పరిస్థితి అనంతరం కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రం ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు నిధులు కేటాయించిన ఆర్థిక సంఘం నీతి అయోగ్ చేసిన సిఫారసులను బుట్ట దాఖలాలు చేస్తు తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వస్తున్న మోదీ తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో ఎంత అభివృద్ధి చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ప్రకటించడం లేదని సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ఓర్వలేకనే రాజకీయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పై విషం కక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ హింగే మహేందర్, ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, పిఎసిఎస్ చైర్మన్ నడిపల్లి విజ్ఞాన్ రావు, వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్ రావు, జిల్లా నాయకులు కుందూరు విద్యాసాగర్ రెడ్డి, సాయిని ముత్యం, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, టౌన్ అధ్యక్షులు కోలేపాక బిక్షపతి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు దాసరి నారాయణరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.