తిరుగులేని రాజకీయ శక్తిగా తెరాస:హస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

 

జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 23:
మండల కేంద్రంలో తెరాస పార్టీ కార్యాలయాన్ని మంగళవారం హుస్నాబాద్
శాసనసభ్యులు వి.సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ టిఆర్ఎస్ అంటే భద్రత టీఆర్ఎస్ అంటే సంక్షేమం టిఆర్ఎస్ అంటే సుస్థిర పాలన అని రాష్ట్రంలో కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనే శక్తి ఏరాజకీయ పార్టీకి లేదని, 60 లక్షల పార్టీ సభ్యత్వం కలిగి రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా తెరాస పార్టీ ఎదిగిందని, ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా పనిచేసి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.అనంతరం కోళ్ల సాయిలు (1వ వర్డ్ మెంబర్), కోళ్ల జీవిత (2 వ వర్డ్ మెంబర్),కోళ్ల ప్రసాద్ బిజెపి పార్టీ మండల ఉపాధ్యక్షులు పాల కేంద్రం సెక్రటరీ కోళ్ల ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షతులై ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో తెరాస లో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిoచ్చారు.