సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం..
కరీంనగర్ టౌన్ ఆగస్టు 23(జనం సాక్షి)
ప్రజాస్వామ్య యుతంగా, శాంతియుతంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర , ధర్మదీక్ష ను భగ్నం చేస్తూ , బిజెపి కార్యకర్తలను తీవ్రంగా కొట్టడాన్ని నిరసిస్తూ బిజెపి రాష్ట్ర పిలుపుమేరకు కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దూబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జ్యోతి నగర్ లో గల వివేకానంద చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి శ్రేణులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కనుసనల్లో టిఆర్ఎస్ అరాచర శక్తులు ప్రజా సంగ్రామ యాత్రకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు . శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారని, ప్రభుత్వానికే అండగా నిలిచి ప్రజా సంగ్రామ యాత్రను నిలుపుదల చేసి బండి సంజయ్ కుమార్ ను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయం అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని వారు దుయ్యబట్టారు .
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, జోన్ అధ్యక్షులు ,కార్పొరేటర్లు, నరహరి లక్ష్మారెడ్డి, నాగసముద్రం ప్రవీణ్, అవదుర్తి శ్రీనివాస్, చోప్పరి జయశ్రీ, పెద్దపెల్లి జితేందర్, కచ్చు రవి ,కోల గాని శ్రీనివాస్, బల్వీందర్ సింగ్
వెంకటస్వామి సోమిడి వేణు, సిద్ధి సంపత్, మొండయ్య, ప్రసన్న రెడ్డి రమేష్ జగన్ రెడ్డి చైతన్య, సుధాకర్ పటేల్ సత్యనారాయణ రెడ్డి, సాయి కృష్ణ,రమేష్ , హరీష్, తదితరులు పాల్గొన్నారు.