తిరుమలగిరి గ్రామం క్రీడలకు పుట్టిల్లు :సర్పంచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి
తిరుమలగిరి (సాగర్) నవంబర్ 14 (జనంసాక్షి): మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో క్రీడా ప్రాంగణ పనులను గ్రామ సర్పంచ్ శాగం శ్రవణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలగిరి గ్రామం క్రీడాకారులకు పుట్టినిల్లు అని, గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకే క్రీడా మైదానాపనులు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నేల చదును చేసి గ్రామ క్రీడాకారులకు అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తూనే,క్రీడాకారులకు పెద్దపీట వేస్తూ వారికి సరైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడ మైదానాలను నిర్మించ తలపెట్టిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఇరిగి నాగయ్య, టిఆర్ఎస్ నాయకులు పగడాల సైదులు, ఉపాధ్యాయులు ఆవుల మధుసూదన్,పీఈటి సునీత,బీరాల రామకృష్ణ రెడ్డి,బత్తుల శ్రీను,గుండెబోయిన తిరుపతయ్య,బత్తుల శ్రీను,నాగేండ్ల బ్రహ్మానందరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు
తిరుమలగిరి గ్రామం క్రీడలకు పుట్టిల్లు :సర్పంచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి




