మహబూబాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి
మహబూబాబాద్ బ్యూరో-నవంబర్14(జనంసాక్షి)
మహబూబాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మహబూబాబాద్ పట్టణ మున్సిపాలిటీ అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించనున్నందున పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు ప్లాంటేషన్ అంతా ఓకే తీరుగా ఉండాలని మొక్కలు లేని చోట మొక్కలు పెట్టించాలన్నారు. ఫుట్ పాత్ లు డివైడర్లు అందంగా తీర్చిదిద్దాలని తెలియజేశారు. రోడ్లు అందంగా కనిపించాలని మార్కింగ్ చేయాలని రోడ్లపై ఉన్న మట్టిని తొలగించాలన్నారు నీటితో మొక్కలపై స్ప్రే చేయించాలని పచ్చదనం కనిపించాలన్నారు. ఉద్యాన శాఖ అధికారి సలహాలు సూచనలు తీసుకొని జిల్లాలోని ఫారెస్ట్ నుండి గాని అవసరమైతే కడియం నుండి కొనుగోలు చేసి అందమైన మొక్కలు ఒక ఎత్తులో ఉండే విధంగా నాటుకోవాలన్నారు. అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిల్వ ఉండకుండా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రేడియం స్టిక్కర్లు వేయించాలని జంక్షన్ వద్ద జీబ్రా క్రాసింగ్ వైట్ అండ్ బ్లాక్ కలర్స్ వేయించాలన్నారు. ప్రధాన రహదారులలో ఉన్న ప్రభుత్వ కార్యాలయ గోడలకు రంగులు వేయించాలన్నారు. మెడికల్ కళాశాల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఉన్న ప్రధాన రహదారి కి ఇరువైపులా నాటే మొక్కలు అందంగా ఒకే సైజులో కనిపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు చెత్త చెదారం ముళ్ళ కంపలు వంటి తదితర చెట్లు ఉంటే తక్షణం తొలగించాలని సూచించారు అదేవిధంగా బంధం చెరువులో గుర్రప్పటక్కన తొలగించాలని చెరువు చుట్టూ ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలన్నారు. మున్సిపల్ అధికారులు సిబ్బందిని అదనంగా నియమించుకొని పారిశుద్ధ్యం మెరుగుకు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జెడ్పిసిఈఓ రమాదేవి, డిఆర్డిఏ పిడి సన్యాసయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి అధికారులు సురేష్ తానేశ్వర్, పంచాయతీ అధికారి సాయిబాబా, పబ్లిక్ హెల్త్ ఈ ఈ రంజిత్, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




