హైదరాబాద్: తిరుమలలో తితిదే పెంచుతున్న ఎర్రచందనం వనంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. గత రెండురోజులుగా ఇక్కడ తిరుగుతున్న ఏనుగులు నీళ్ల పైపులను, చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. ఎర్రచందనం వనంలో ఏనుగుల విధ్వంసాన్ని తితిదే అటవీ అధికారులు పరిశీలిస్తున్నారు. తితిదే రూ. 5 కోట్లతో ఈ ఎర్రచందనం వనాన్ని పెంచుతోంది.




