తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 6 కంపార్లుమెంట్లు నిండాయి. కాగా, సోమవారం స్వామివారిని 56,073 మంది భక్తులు దర్శించుకున్నారు.




