తిరుమలాయపాలెం మండల కేంద్రంలో నర్సింగ్ కళాశాలని నిర్మించాలి PDSU డిమాండ్
ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం (నవంబర్ 24) జనం సాక్షి.. పాలేరు నియోజకవర్గం నర్సింగ్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది దానిని తిరుమలాయపాలెం మండల కేంద్రంలో నిర్మాణం చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు పాలేరుడివిజన్ కార్యదర్శి మాగి*రాకేష్ మాట్లాడుతూ
తిరుమలయపాలెంలో అసైన్మెంట్ ల్యాండ్.బంచరాయి భూమి 10 ఎకరాల ఖాళీ స్థలము విశాలముగా నర్సింగ్ కళాశాలని ఇక్కడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు
పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందించి వారి జీవితాలకు బంగారు బాటలు వేయాలని, ఖమ్మం జిల్లా అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు, కళాశాలలో సరిపడా పరికరాలను ఇతర అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి అనేకమార్లు విన్నవించు కున్నప్పటికిని వారు నిమ్మకు నేరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించి డిగ్రీ దోస్తు నాలుగో దశ ప్రక్రియను ప్రారంభించి సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ ఈ సమస్యలను వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




